Home »
ఐరన్‌ టానిక్‌


భర్త : ఏమే కాంతం . నాకెందుకో భయంగా ఉందే.
భార్య : ఎందుకు ... ??
భర్త : మరి నెల రోజులనుండి ఐరన్‌ టానిక్‌ వాడుతున్నాను కదా.. పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని.

అందంగా కన్పించాలని


రమేష్‌ : పడుకునేముందు షోగ్గా తయారయి పడుకుంటున్నావు.
వివేక్‌ : కలలో కన్పించే అమ్మాయిలకు అందంగా కన్పించాలని ...

కిలో నూనె ఎంతండీ?


"షాపులో కిలో నూనె ఎంతండీ?" అడిగింది సుజాత
"నలభై రూపాయలు" చెప్పాడు వ్యాపారి
"ఒకే సారి పదికిలోలు తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా?"
"ఒక పావు కిలో తగ్గుతుంది"! అని చెప్పాడు వ్యాపారి నవ్వుతూ..

అతని పేరు ఏడుకొండలు


"అతనేంటి పేరగడితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండలవేపు చూపించి వెళ్ళిపోతున్నాడు?"
"ఓ... అతనా... అతని పేరు ఏడుకొండలు"
"సోమవారం రోజున ఆయన మౌన వత్రం లేండీ! మాట్లాడడు!"

డ్రింకుమీద ప్రమాణం


గోపీ : ఇక మీదట డ్రింక్‌ ముట్టుకోనని ప్రణామం చేశావు కదరా.
రాము : అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను!!!

ఐరన్‌ టానిక్‌


భర్త : ఏమే కాంతం . నాకెందుకో భయంగా ఉందే.
భార్య : ఎందుకు ... ??
భర్త : మరి నెల రోజులనుండి ఐరన్‌ టానిక్‌ వాడుతున్నాను కదా.. పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని..

అందంగా కన్పించాలని


రమేష్‌ : పడుకునేముందు షోగ్గా తయారయి పడుకుంటున్నావు.
వివేక్‌ : కలలో కన్పించే అమ్మాయిలకు అందంగా కన్పించాలని ...

అర్ధం కాని సినిమా


విజ్ఞాన్‌ : నా అభిమాన హీరో నటించిన సిన్మాలన్నీ కనీసం నాలుగైదు సార్లు చూస్తాను తెలుసా.
జానీ : ఏం పాపం ఒక్కసారి చూస్తే అర్ధం కాదా.

పొదుపరి భర్తతో తిప్పలు


భార్య : చీర కొనుక్కుంటాను.. వెయ్యి రూపాయలిమ్మంటే ఇవ్వరేం. పెళ్లికి ముందు డబ్బుని నీళ్లలా ఖర్చుపెడతానని కోతలు కోశారు.. నిలదీసింది భర్తని.
భర్త : ఓసి పిచ్చిదానా.. నీకింకా తెలియదేమో.. నేను నీళ్లని కూడా చాలా పొదుపుగా వాడతా

తెలుగు టీ.వి. కార్యక్రమాలు చూళ్లేక

భార్య : ఎందుకండీ.. అంతగా తాగుతున్నారు.

భర్త : గంటసేపట్లో తెలుగు టీ.వి. కార్యక్రమాలు వస్తాయి కదా.. వాటిని చూసి తట్టుకోటానికి తాగుతున్నాను.